Thursday, March 12, 2026

సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

తిప్పారపు శ్రీనివాస్, మండల కార్యదర్శి

నేటి సాక్షి,బెజ్జంకి:
సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నందున ఈ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మండల కేంద్రంలో పార్టీ జెండా ఎగురవేసిన మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్. ఈ సందర్భంగా తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభ లను విజయవంతం చేయాలని అన్నారు. సిపిఎం పార్టీ నిరంతరం పేదలు, కార్మికులు, కష్టజీవుల, రైతుల హక్కుల కోసం, విద్యార్థి నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న పార్టీ, ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో ఉద్యమిస్తున్న పార్టీ సీపీఎం పార్టీ అని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బీవీ రాఘవులు తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలు చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకోవడం జరుగుతుందని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బెజ్జంకి గ్రామ శాఖ కార్యదర్శి సంఘ ఎల్లయ్య, నాయకులు బోనగిరి లింగం, కుంట సత్తయ్య, దుగ్యాని తిరుపతి, ప్రభాకర్, శ్రీనివాస్, మహేష్, సారయ్య, తిరుపతి, నర్సింగం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News