- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, బుర్రి శ్రీరాములు
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట ను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మండల విస్తృత సమావేశం బోళ్ళ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ .కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రజా సమస్యల పైన సీపీఎం పార్టీ పోరుబాట కార్యక్రమం పేరుతో ఈనెల 28 వ తేదీ వరకు మండలం లోని అన్ని గ్రామాలలో ప్రజా సమస్యల పైన ఇంటింటి సర్వే నిర్వహించి వాటి పరిష్కారం కొరకు మండల తాసిల్దార్ కార్యాలయమును ఈ నెల 24న ముట్టడిస్తామని తెలిపినారు. అదేవిధంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించి సమస్యల పరిష్కారం తో పోరుబాట ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య, ఉపేందర్, వెంకటాద్రి, సైదులు, లింగయ్య, సతీష్, పిచ్చయ్య, ప్రజా సంఘాల నాయకులు గడ్డం వినోద్, మంగమ్మ, వివిధ గ్రామాల పార్టీ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.



