Tuesday, March 17, 2026

ఫీజు పోరును విజయవంతం చేయండి

  • చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : పేద విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5న నిర్వహించే ఫీజుపోరును విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఆయన ఇంటి వద్ద ఫీజు పోరుకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులపై కక్ష కట్టిందన్నారు. విద్యా దీవెనకు రూ.2800 కోట్లు, వసతి దీవెనకు రూ.1100 కోట్లు మొత్తం రూ.3900 కోట్లు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణం ఆ బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో 5వ తేదీన జరిగే ఫీజు పోరులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండ గడతామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఫీజు కష్టాలు తప్పలేదని, ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ ఆలస్యం చేయడంతో తల్లి దండ్రులపై ఆర్థిక భారం పడిందన్నారు. విద్యార్థుల కష్టాలు తెలుసుకుని సకాలంలో ఫీజులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగనన్న ఫీజు పోరుకు పిలుపునిచ్చారని, ఆ పోరాటనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలకు బాధ్యతలను అప్పగించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ఫీజు పోరుకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చివరగా ఫీజుపోరుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంకు చెందిన వైసీపీ నేతలు ఓబుల్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, యుగంధర్, చిలమంద హరిక్రిష్ణ, సుకుమార్, ముని, చెంగల్ రెడ్డి, పార్థ సారథి, శశి, భానుకుమార్, వినోద్ కుమార్, సురేష్, మోహన్ రెడ్డిలు వున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News