- కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్
నేటి సాక్షి, మందమర్రి:-
జిల్లాలోని చెన్నూరు పట్టణంలో నిర్వహించు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ గురువారం పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న చెన్నూరు పట్టణంలోని ఎంఆర్ఆర్ గార్డెన్స్ లో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సి అభ్యర్థి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. పట్టణ పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, బూత్ ఇంఛార్జ్ లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బూత్ ఇంచార్జ్ లు ఈ కార్యక్రమానికి పట్టభద్రులను తీసుకురావాలని సూచించారు.





