- డి బి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : దళిత బహుజన ఫ్రంట్ ఆద్వర్యంలో నవంబర్ 26, 2014 నుండి జనవరి 26, 2015 వరకు సుధిర్ఘంగా రెండు నెలల పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో భారత రాజ్యాంగ విలువల ప్రచారోద్యమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, గ్రామాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఆ క్రమంలోనే ఈ నెల 25 న హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట కళ్యాణ మండపంలో 75 ఏండ్ల భారత రాజ్యాంగ ఉత్సవాలలో భాగంగా భారత రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర సదస్సు నిర్వహణకు సన్నద్దమైందన్నారు. ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని, డి బి ఎఫ్ ఉద్యమ కార్యకర్తలకు, దళిత, గిరిజన ప్రజా సంఘాల బాధ్యులకు, అంబేద్కర్ వాధులకు డిబిఎఫ్ రాష్ట్ర అద్యక్షులు రౌతు రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర సదస్సు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగిందని, ఈ సదస్సుకు ముఖ్య అథిదులుగా వరంగల్ యంపి కడియం కావ్య, ఆత్మీయ అథిదులుగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ప్రత్యేక అథిదులు గా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ బాస్కర్, ప్రధాన వ్యక్తలుగా డిబిఎఫ్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, ప్రొఫెసర్స్ మరియు డిబిఎఫ్ రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, రాష్ట్ర నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా కార్యదర్శులు మేకల అనిత, చుంచు నరేష్, ఎల్ ఎచ్ పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆజ్మీరా, వెంకట్, పుల్యాల మంజుల, రాజు, కిరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




