- ఆలయ పూజారి సతీష్ భవాని
నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని పాత బస్టాండ్ బురదగుడం సమీపంలోని దొర గారి తోటలో నిర్మించిన శ్రీశ్రీశ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలకు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై, జయప్రదం చేయాలని ఆలయ పూజారి సతీష్ భవాని కోరారు. సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణంలో నూతనంగా నిర్వహించిన కామాఖ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహాశివరాత్రి పర్వదినం నుండి ఆరు రోజులపాటు తాంత్రిక సాంప్రదాయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మరో మూడు రోజులు వైదిక సంప్రదాయంలో పూజలు నిర్వహించి, విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం నుండి వైదిక సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. మార్చి 6న బ్రహ్మ ముహూర్తనా ఆలయంలో యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ స్థాపన, అనంతరం మహా కుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, బలి ప్రధానం అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో పుణ్యకార్యమని, మూడు రోజులపాటు అత్యంత వైభవంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరారు.




