- పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సన్ పల్లిఎక్స్ రోడ్ లో జరిగే మహా జాబ్ మేళా ను విజయవంతం చేయాలని పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ తెలియజేశారు. నేడు అనగా శుక్రవారం 24వ తేదీన ఉదయం 10:00 కు జరగబోయే మహా జాబ్ మేళాను విజయవంతం చేయాలని సహకార బ్యాంక్ చైర్మన్ మంచే పాండు యాదవ్ ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మహేశ్వరం మండల కేంద్రంలో ఈ యొక్క మహా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది జాబ్ మేళలో ఆసక్తి గల్లా యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మహా జాబ్ మేళాలో 20 మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. ఐదవ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు 18 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు యువతి యువకులు జాబ్ మేళలో పాల్గొనాలని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. 18 వేల రూపాయల జీతాల నుండి మొదలుకొని 60 వేల రూపాయల వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. మహేశ్వరం మండలం ప్రజలతోపాటు అనుబంధ గ్రామాలైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ తెలియజేశారు.





