Monday, March 30, 2026

నేడే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి

  • రవీంద్రశర్మ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి
  • సురేష్ సెక్రెటరీ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మహబూబాబాద్

నేటి సాక్షి మహబూబాబా ద్ నరసింహుల పేట భూక్యా రవి: ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగే జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా, మహబూబాబాద్ జిల్లాకోర్టులో జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ అదేశాలమేరకు సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాసేవాధికార సంస్థకు సెక్రటరీ అయిన సురేష్ మహబూబాబాద్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులను కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్ని కేసులను సాధారణ పద్దతిలో పరిష్కరించడం సాధ్యంకాదని, అందుకనే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకుని రాజీపడ గలిగే క్రిమినల్, సివిల్ భూ తగాదా, మోటార్ వాహన ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, విద్యుత్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, మహబూబాబాద్ సబ్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతిరావు, జిల్లా కోర్టు పరిపాలనాధికారి క్రాంతి కుమార్, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు దేవేందర్, సర్వయ్య, రాజేష్, రవి కుమార్ మరియు కోర్ట్ కానిస్టేబుల్స్ హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News