Saturday, March 14, 2026

రద్దయిన మల్లెందొడ్డి గ్రామసభ

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ప్రభుత్వ అధికారుల ఆదేశాను ప్రకారం బుధవారం జరగాల్సిన గ్రామ సభ ప్రజల అంగీకారంతో రద్దు అయ్యింది. అందుకు గల కారణాలు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పతకం ప్రకారం భూమిలేని ప్రతి రైతుకు 12,000 అందజేయడం ప్రభుత్వ హామీ, కానీ ఇందుకు విరుద్దంగా కొందరి గ్రామ అధికారుల చెప్పు చేతల్లో భూమి కలిగినవారి వివరాలు ఇచ్చి అసలైన లబ్ధిదారులకు మేలు కలగకుండా పోయింది. ఇందిరమ్మ ఇండ్లు పతకంలో భాగంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం… కానీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల పేర్లు ఎంపిక చేసి నిజమైన ఇల్లులేని వారికీ కాకుండా ఆర్ సి సి స్లాబ్ ఇల్లు ఉన్న వారిని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇవి మాత్రమే కాక పింఛన్ విషయంలో కూడా దొంగ సర్టిఫికెట్ తీసుకోని అర్హత కలిగిన వారికి కాకుండా పింఛన్ దారుల్ని ఎంపిక చేసారు. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ చేసి అర్హత కలిగిన వారిని గుర్తించాలని అధికారులని కోరారు. పై కారాణాలే కాకుండా గతంలో ఇంకా ఎన్నో ప్రభుత్వ పతకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ అధికారుల చేతివాటం ప్రదర్శించి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎంపిక చేసారు. అందుకుగాను గ్రామ ప్రజల తీర్మానంతో మళ్ళీ రిసర్వే చేసి నిజమైన వారికి సంక్షేమ పతకాలు అందేలా చూడాలని నేటి ఈ గ్రామసభ ను రద్దు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇలాగే కొనసాగితే గ్రామ ప్రజలందరం కలిసి కలెక్టర్ కు తీర్మానం ఇవ్వడం జరుగుతుందని గ్రామ ప్రజలు అధికారులకు హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News