Thursday, March 26, 2026

మామునూరు ఎయిర్ పోర్టు భూ..సేకరణ

  • రైతుల నుంచి నిరసన

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణ సర్వే చేపట్టడం పై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించింది దీంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు నక్కల పెళ్లి రోడ్డుపై నిరసన ప్రదర్శించారు తమకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పరిస్థితి ఉధృతంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ గట్టి బందో బస్తు ను ఏర్పాటు చేశారు రైతుల నిరసన ఎందుకంటే మామునూర్ ప్రాంతంలో ఒక ఎకరం భూమి కనీసం 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేస్తుందని ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు పరిహారం విషయంలో ప్రభుత్వము నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాక పోవడంపై నిరసనకు దిగారు మామునూరు విమానాశ్రయానికి 175 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు ప్రణాళికను రూపొందించారు ఈ మేరకు సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికీ 690 ఎకరాలు గతంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కి కేటాయింపులు జరిగాయి కానీ కొత్త రన్ వేలు టెర్మినల్స్ నిర్మాణం వంటి పెరుగుతున్న మౌలిక సదుపాయాల అదనంగా 280 ఎకరాల భూమి అవసరం ఏర్పడింది ఈ విమానాశ్రయం పనులను చేపట్టేందుకు ఏ ఏ ఐ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి అప్పగిస్తే 2 1/2 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు రెండు రోజుల క్రితం ప్రకటించారు దీంతో భూ..సేకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని స్థానిక రైతులు ఆందోళనలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News