నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : సానిపాయ అటవీ ప్రాంతంలో అరెస్టు చేసిన రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో చొరబడుతున్న కొందరు వ్యక్తులను అడ్డుకున్న రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు సూచనలు మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ ఎస్ ఐ టి. విష్ణు వర్ధన్ కుమార్ టీమ్, స్థానిక ఎఫ్ బీఓ జీ. అనిల్ కుమార్ సహకారంతో అన్నమయ్య జిల్లా సానిపాయ కేంద్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. జాండ్రపెంట ఫారెస్టు బీటు పరిధిలో కొరతుకోన వద్ద కొందరు వ్యక్తులు అడవిలోకి చొర బడేందుకు ప్రయత్నం చేయగా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు. అయితే వారిలో అందరూ పారిపోగా ఒక వ్యక్తి పట్టుబడ్డారు. అతనిని తమిళనాడుకు చెందిన వ్యక్తీ గా గుర్తించారు. అతనిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





