నేటి సాక్షి, బెజ్జంకి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ముత్తన్నపేట గ్రామానికి చెందిన గాజ రవి వయసు 45,అనే వ్యక్తి వ్యవసాయనికి చేసిన అప్పులు,పిల్లల చదువుల ఫీజులు ఎలా చెల్లించాలో అని బాధపడుతు బుధవారం రోజున సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని, కుటుంబ సభ్యులు గుర్తించి 108 వాహనములో చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగ అప్పటికే మృతి చెందాడని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి మరణించాడని,మృతుని భార్య గాజ రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.మృతునికి ఒక కూతురు,కుమారుడు కలరు.



