Friday, April 3, 2026

అనారోగ్య కారణాలతో వ్యక్తి ఆత్మహత్య

నేటిసాక్షి(కె. గంగాధర్ )పెగడపల్లి : పెగడపల్లి గ్రామానికి చెందిన గ్రామానికి కొత్తూరు రాజయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కరీంనగర్ లో నివసిస్తున్నాడు. కొద్ది రోజులుగా రాజయ్య అనారోగ్యం, మానసిక ఒత్తిడి వల్ల తాగుడుకు బానిస అయ్యాడు. ఈ కారణంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తన సొంత గ్రామమైనటువంటి పెగడపల్లికి వచ్చి ఇంట్లో ఎవరూలేని సమయంలో రాత్రి గొడ్డలితో తల భాగంలో కొట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి తాడుతో దూలానికి ఉరివేసుకొని వున్నాడు. ఈ రోజు ఉదయం అది గమనించిన బాలే కవిత, చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుటుంబ సభ్యులు వచ్చి లోపల చూసేసరికి తన తండ్రి రక్తపు మరకలతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడని కొడుకు విద్యాసాగర్ తెలుపడం జరిగింది. మృతుని కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెగడపల్లి ఎస్సై సిహెచ్ రవికిరణ్ తెలిపినారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News