Tuesday, March 17, 2026

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నేటి సాక్షి, బెజ్జంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుగ్గిళ్ళ గ్రామానికి చెందిన సోము కొమురయ్య  వయసు 58 సంవత్సరాలు మృతి చెందారు. ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సోము కొమురయ్య అను వ్యక్తి కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు.శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో రేగులపల్లిలో కూరగాయలు అమ్మి తిరిగి తన యొక్క ఎక్సల్ బండి పై వెళ్తూ పల్లోటి స్కూల్ వద్ద రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుండి కరీంనగర్ వెళ్లే గుర్తుతెలియని వాహనం వెనక నుండి ఢీకొట్టగా అతడు అక్కడికక్కడే మరణించాడు.అతడి కుమారుడైన మహేందర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెజ్జంకి పోలీసులు నిర్వహించారు.గుర్తు తెలియని వాహనం గురించి బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News