నేటిసాక్షి(కె. గంగాధర్ ) పెగడపల్లి : పెగడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను అదే గ్రామానికి చెందినటువంటి బాస రాము అనే వ్యక్తి మరియు రంగదాముని పల్లెకు చెందిన ప్రణయ్ అను ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో బాలికను వేధించగా అట్టి వేధింపులు తాళలేక మైనర్ బాలిక శనివారం రోజు పురుగుల మందు త్రాగగా అది గమనించిన మైనర్ బాలిక తల్లి చికిత్స కొరకు కరీంనగర్ లోని గుడ్ లైఫ్ ఆసుపత్రిలో చికిత్స అందించే క్రమంలో మృతి చెందినదని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పెగడపల్లి ఎస్సై సిహెచ్ రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు బాస రాము తండ్రి నరసింగం రామ్ భద్రుని పల్లి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు చెప్పడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని పెగడపల్లి ఎస్సై సిహెచ్ రవికిరణ్ తెలిపినారు.





