నేటిసాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. చెరకు పంటలో యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. చెరకు సాగుకు సంబంధించి ఇతర సందేహాలను శాస్త్రవేత్తలతో వెల్మల రామిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు. దీనిలో మండల వ్యవసాయ అధికారి పి జ్యోతి, ఏఈఓ లు రాజేష్, శ్రీలత, గ్రీష్మ, ప్రశాంత్ మరియు రైతులు పాల్గొన్నారు.




