- డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డి ని గెలిపించాలని నాయకులకు, పట్టభద్రులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టభద్రులకు అమూల్యమైన ఓటును రెండో నెంబర్ లో గల అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటుగా నమోదు చేయలని అని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,మండల ఉపాధ్యక్షులు కర్రావుల శంకర్, మండల అధికార ప్రతినిధి జనాగం శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రావుల సందీప్, సోషల్ మీడియా ఇంచార్జి కుంట హరికృష్ణ, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.





