
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల దుబాయ్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా తాటికొండ శ్రీనివాస్, ఉప అధ్యక్షుడిగా జక్కు మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మానాల దుబాయ్ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అందరూ సహకరించాలని కోరారు. తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానాల దుబాయ్ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.

