Monday, March 16, 2026

” నేటి సాక్షి ” క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి (కోక్కుల వంశీ) :
పత్రిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ” నేటి సాక్షి ” దినపత్రిక 2025 క్యాలెండర్ ను గురువారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అనతి కాలంలో ‘ నేటి సాక్షి ‘ దినపత్రిక అందరికి అందుబాటులోకి వచ్చి పాఠకుల మన్ననలను పొందిందని, ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి ప్రత్యేక ఎడిషన్లు, క్లిప్పింగ్స్ ఆన్లైన్ ద్వారా పంపుతూ ప్రజలకు,అధికారులకు దగ్గరైదని కొనియాడారు. పత్రికలు ప్రజల పక్షాన మాత్రమే ఉండాలని, నిస్వార్ధంగా, నిబద్దతో వార్తలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని సూచించారు. నేటి సాక్షి దినపత్రిక ప్రజల మన్ననలు పొందాలని, ప్రజా సమస్యలను వెలికి తీసి అధికారులకు చేరవేయడంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటిసాక్షి వేములవాడ ఆర్ సి ఇంచార్జి కోక్కుల వంశీ, చందుర్తి విలేఖరి సతీష్, మార్కెట్ కమిటీ డెరైక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు జూల దిలీప్, సీనియర్ నాయకులు తుమ్ రవీందర్, అల్లూరి శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News