Sunday, March 15, 2026

మంద కృష్ణ మాదిగ సభను విజయవంతం చేయాలి

  • మాజీ ఎమ్మెల్యే కాసీపేట లింగయ్య

నేటి సాక్షి, మందమర్రి:– లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 3న చెన్నూరు లో జరిగే మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య తెలిపారు. సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే లక్ష డబ్బులు వేయి గొంతుకలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 3న చెన్నూరు లో జరిగే మందకృష్ణ మాదిగ సభలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మాదిగ, మాదిగలను అభిమానించే అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున తరలివచ్చి, సభను విజయవంతం చేయాలని కోరారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు మాదిగ సోదరుల ఐక్యత బలం చూపెట్టవలసిన సమయం ఆసన్నమైనదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పినందున ఫిబ్రవరి 7న లక్ష డబ్బులు వెయ్యి గొంతుకుల కార్యక్రమంతో ప్రభుత్వం కళ్ళు తెరిచేలా, ఎంతో న్యాయబద్ధమైన వర్గీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులకు చెంపపెట్టులా ఈ కార్యక్రమం గుణపాఠం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంతెన పోశం, జీడి సారంగం, రేగుంట చంద్రశేఖర్, శనిగారపు కుమార్, కంబాల రాజనర్సు, దాసరి రాజనర్సు, ఏనుగురాళ్ల వెంకన్న, మంతెన సుమన్, వేల్పుల కిరన్, ముల్కల రాజేంద్రప్రసాద్, బచ్చలి భీమయ్య, గొల్లపల్లి భీమయ్య, సప్పిడి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News