Thursday, March 26, 2026

మండల ఆశా వర్కర్ల సమావేశం

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి నియోజవర్గం అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మండల ఆశా వర్కర్ల సమావేశాన్ని వైద్యా అధికారి ఫర్హానా ఖానం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలలో ఒకసారి ఆశా డే ఉంటుందని ఇందులో భాగంగా డెలివరీ కేసెస్ కాన్పుల వివరాలు బాలింతలు గర్భవతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పౌష్టిక ఆహార లోపం లేకుండా గ్రామాలలో ఇంటింటికి తిరిగి అవగాహన పెంచాలన్నారు. షుగర్,బీపీతో పాటు క్యాన్సర్ స్కానింగ్ పాఠశాల విద్యార్థుల వివరాలను పూర్తి చేయాలన్నారు. టీబి ఉన్న రోగాలను గుర్తించి, హాస్పిటల్ కి వచ్చి మందులను వాడించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ నోడల్ అధికారి రాజేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News