నేటి సాక్షి, బెజ్జంకి: భారతీయ జనతా పార్టీ (బిజెపి) బలపరిచిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందిన సందర్భంగా మంగళవారం బిజెపి బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో బిజెపి నాయకులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మల్క కొమరయ్య గెలుపుకు కారణమైన ఉపాధ్యాయులు, బిజెపి పార్టీ శ్రేణులు, తపస్సు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బిజెపి అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బామండ్ల జ్యోతి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బండిపెల్లి సునీత గౌడ్, మండల నాయకులు ఒగ్గు కనకయ్య, సాన వేణు, దారం సత్తిరెడ్డి, పులి శ్రీకాంత్ గౌడ్, వీర మహేందర్ రెడ్డి, గంగుల ఎల్లం, జగన్, బుర్ర వినీత్, గుంటి సాయి, జంగిడి కమలాకర్ రెడ్డి, రావుల బాల్రెడ్డి, చంద్రారెడ్డి, కోడిత్యాల రాము, కోడిముంజ రాజు తదితరులు పాల్గొన్నారు.




