Wednesday, April 1, 2026

మండల పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డికి అభిమానుల నడుమ ఆత్మీయ సత్కారం

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి మండల వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొటాల చంద్రశేఖర్ రెడ్డికి అభిమానుల నడుమ ఆత్మీయ సత్కారం జరిగింది. ముందుగా అధ్యక్షునికి అభిమానులు భారీ కేక్ కట్ చేసి ఘనంగా పుష్పగుచ్ఛాలు అందించి దుశ్శాలవతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మీలాంటి నాయకత్వంలోవై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కోసం జగనన్న సీఎం చేసేందుకు, మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గా చూడాలని నిరంతరం పోరాటం చేసి జైలు జీవితాన్ని అనుభవించానని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజల కృషి పట్టుదల ఫలితంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనలో సంక్షేమ పథకాలతో సుపరిపాలన అందించారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం పథకాలతో పాటు తన స్వంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టి అదే విధంగా కరోనా లాంటి కష్టం కాలంలో నిరంతరం ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. నాపై నమ్మకం ఉంచి మళ్ళీ మండల పార్టీ అధ్యక్షులుగా నియమించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని కృషి చేస్తానన్నారు ఈ సన్మాన కార్యక్రమం లో ఎంపిపి హేమేంద్రకుమార్ రెడ్డి, మాజీ ఎంపిపి కుసుమ కుమారి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లం చంద్రమౌళి రెడ్డి, పి. చంద్రశేఖర్ రెడ్డి, అగరాల దేవరాజులు రెడ్డి, దెయ్యాల మాధవరెడ్డి, ఔరంగజేబు, బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి, కుప్పి రెడ్డి భాస్కర్ రెడ్డి,ఒంటి శివశంకర్ రెడ్డి, కోటీశ్వర రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రవీంద్ర రెడ్డి,అగరాల భాస్కర్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, సిధిక్ భాషా, రాజశేఖరరెడ్డి, వెంకటయ్య, కె.మధన్ మోహన్ రెడ్డి, సూరి, మురళీ రెడ్డి, వైఎస్సార్ సిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News