Monday, April 13, 2026

మండల పార్టీ అధ్యక్షుడు కొత్త పాటి మునీశ్వరరెడ్డికి ఘన సత్కారం

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెరుమాళ్ళపల్లి కి చెందిన కొత్తపాటి మునీశ్వరరెడ్డికి మండల పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయా పంచాయతీల సర్పంచ్ లు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్షుడు గా బాధ్యతలు అప్పగించినందుకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మాజీ తుడా చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నాజన్మాంతం రుణపడి ఉంటానని అదేవిధంగా తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండలంలోని నాయకులు కార్యకర్తలతో కలిసి అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు రాబోయే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి విజయానికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపిపి విడుదల మాధవ రెడ్డి, అవిలాల సర్పంచ్ చెందిలి వెంకటరమణ,సి. గొల్లపల్లి సర్పంచ్ విడుదల రవికుమార్ రెడ్డి,పెరుమాళ్ళ పల్లి సర్పంచ్ జోగి మోహన్,సి మల్లవరం సర్పంచ్ మొక్కల భారతి తిమ్మారెడ్డి, లింగేశ్వర నగర్ సర్పంచ్ కోటీశ్వరరావు,ఓటేరు సర్పంచ్ లక్ష్మి రాజా, గాంధీ పురం సర్పంచ్ లక్ష్మి శివకుమార్,మల్లంగుంట సర్పంచ్ జానకి రామచంద్రయ్య, పైడిపల్లి సర్పంచ్ విష్ణు స్పంధన గోవర్థన్ రెడ్డి, నాయకులు మూలం చంద్రమోహన్ రెడ్డి,మల్లారం వాసు తదితరులున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News