- వొడితల ప్రణవ్
- ఆర్థిక వేత్తగా అనేక సేవలు
- తెలంగాణ ఏర్పాటు విషయంలో కృషి చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ చేసిన కృషి రాష్ట్ర ప్రజల మదిలో ఉంటుందని, దేశానికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన గొప్ప వ్యక్తి అని, అలాంటి వ్యక్తి మరణం దేశ ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో సగటు పేదవాడికి కావలసిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ విధంగా పథకాలను రూపొందించారని అన్నారు.

