
నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి :
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలుపుతూ సుద్ద ముక్కపై మన్మోహన్ సింగ్ ప్రతిమను చెక్కి చందుర్తి మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాపిల్ల నరేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపీల నరేష్ మాట్లాడుతూ.. భారతదేశానికి ఒక మంచి ఆర్థికవేత్తగా, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా దేశానికి ఆదర్శవంతులు అన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా దేశ అభివృద్ధి కోసం దేశానికి మంచి గౌరవం తీసుకొచ్చారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గుర్తింపు ఎప్పటికీ ఉండాలని, కాపిల్ల నరేష్ ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఆర్టిస్టుగా మన్మోహన్ సింగ్ ప్రతిమను చాక్ పిస్ పై చెక్కినట్టు తెలిపారు. ఈ ప్రతిమను చెక్కడానికి నాలుగున్నర గంటలు కష్టపడ్డానని, భారత దేశ కీర్తిని చాటిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిమను తన బుక్ సెల్ఫ్ లో వుండాలని చెక్కడం జరిగిందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ తన చాక్ పీస్ ద్వారా చెక్కిన ప్రతిమతో ఘన నివాళులు అర్పించారు.

