నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా మనోహర్ నియమితులైయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ జిల్లా ఖానపూర్ మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్‌ను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేయగా ఆయన విధుల్లో చేరారు. ఇప్పటిదాక ఇక్కడి మేనేజర్ వెంకటి అదనపు బాధ్యతలతో పని చేసారు.




