నేటి సాక్షి, మందమర్రి:- మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న పెద్దపల్లి సత్యనారాయణకు పలువురు అంబేద్కర్, బీసీ, ప్రజాసంఘల నాయకులు మద్దతు తెలిపారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి వెళుతున్న సత్యనారాయణ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు అంబేద్కర్ సంఘ నాయకులు మొయ్య రాంబాబు, కనకం రవీందర్, ముల్కల రాజేంద్రప్రసాద్, తుంగపిండి ఉపేందర్, బీసీ సంఘం నాయకులు సాదుల విద్యాసాగర్, చేగొండ సత్యనారాయణ, రమేష్, ప్రజా సంఘాల నాయకులు మధు, సత్యంబాబు, రవి డేవిడ్ లు ఆయనకు మద్దతు తెలిపారు.





