- మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు
నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 2024 కూటమి ప్రభుత్వంఅనేక సంక్షేమ పథకాలు కనుమరుగైనాయి. అలాగే ఏర్పడిన తర్వాత గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు జరిపిన అనేక సంక్షేమ పథకాలు కనుమరుగైనాయి. కూటమి ప్రభుత్వం వస్తే అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 హామీలు కూడా అటక ఎక్కినాయి. పోనీ కనీసం ఆరోగ్య శ్రీ స్కీం అయినా ఈ సర్కారు సవ్యంగా కొనసాగిస్తుందని భావించినా ప్రస్తుతం ఇది పెద్ద స్కాం కాబోతుంది. ఈ ఆరోగ్య శ్రీ అంశంపై మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటలకు ఇక నుండి ఆరోగ్యశ్రీ స్కీమ్ కాదు అదో పెద్ద స్కామ్ అనే అంశంపై YouTube ద్వారా తెలియజేయనున్నారు.

