
నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలోని శాంతి నగర్ లో గంజాయి అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు సి ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.శనివారం పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని శాంతినగర్ కాలనీవాసులు గమనించి సమాచారం అందించారు.దింతో నేను ఎస్సై కిరణ్ మరియు సిబ్బందితో కలిసి శాంతినగర్ కు వెళ్లగా అక్కడ ఒక ఇంటిలో నలుగురు వ్యక్తులు ఉండగా వారిని పట్టుకొని విచారణ చేయగా వారు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ అని తెలిపారు. వారు గత కొన్ని నెలల క్రితం మెట్ పల్లికి వచ్చి అమాలి పని చేయుచు శాంతినగర్ లో ఒక ఇల్లును అద్దెకు తీసుకోని ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి తాము తాగుతూ మెట్ పల్లి మరియు మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఐదు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముచున్నారని అన్నారు.వారు తిరగడానికి తమ యజమాని అయిన పసుపు మరియు మక్కల వ్యాపారికి చెందిన అశోక్ లీలాండ్ వెహికల్ లో మెట్ పల్లి,మల్లాపూర్ ఏరియాలో తిరుగుతూ మధ్యాహ్నం అద్దెకు ఉన్న ఇంటికి వచ్చి గంజాయి తాగుతారని అన్నారు. అట్టివాసన చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. బీహార్ నుండి తీసుకొని వచ్చిన గంజాయిని మరియు వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్ లను అశోక్ లేలాండ్ బండిని స్వాధీనపరచుకున్నామని సి ఐ తెలిపారు. వారి వద్ద 4.50 గ్రాముల గంజాయిని స్వాధీన పరచుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు సి ఐ పేర్కొన్నారు.





