Friday, April 3, 2026

మార్కెట్లు, దుకాణాలు వేలం వాయిదా

కమిషనర్ ఎన్. మౌర్య

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) :
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 21 వ తేదీ నిర్వహించాల్సిన వేలం పాటను 22 వ తేదీ కి వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ఎన్.మౌర్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 1.ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్టు 2. రామచంద్ర గుంటకట్ట మార్కెట్టు 3. జంతువధశాల 4.గాంధీరోడ్డు, తిలక్ రోడ్డు, మాస్క్ రోడ్డు వగైరా స్థలములు 5. భారతి బస్టాండ్ పార్కింగ్ స్థలములకు 6. జి. ఎన్ మరియు జి. ఎస్ మాడా స్ట్రీట్ నందు పార్కింగ్ స్థలము 7. వినాయక సాగర్ పార్కు 8. షాపింగ్ కాంప్లెక్స్ వెనుక నిర్మించిన గ్రౌండ్ మరియు మొదటి అంతస్తులో “గేమ్ జోన్” పెట్టుకొనుటకు 9. వినాయక సాగర్ నందు షాపింగ్ కాంప్లెక్స్ రెండవ అంతస్తు హాలును 10. తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, తిరుపతి వారు నూతనముగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఇందిరా మైదానము) గ్రౌండ్, మొదటి అంతస్తు మరియు రెండవ అంతస్తులకు ఈనెల 21 వ తేదీ ఉదయం 11.00 గంటలకు సీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించ నిర్ణయించారు. 21 వ తేదీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరుపతి పర్యటన సందర్బముగా 21 వ తేదీ నిర్వహించవలసిన సీల్డ్ టెండర్ మరియు బహిరంగవేలము 22 వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నామని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News