నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం పరిధిలోని తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అవిలాల పంచాయితీకి చెందిన అవిలాల ఉప సర్పంచ్ పయ్యావుల కవితా రాజగోపాల్, ఎంపీటీసీ దేశవాణి, పలు వార్డ్ మెంబర్లు వైసీపీ నుండి టిడిపిలో చేరిక. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలు అమలులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పతకాలుతో పాటు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చూసి ఆకర్షితులై శుక్రవారం తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేరారు. అనంతరం అవిలాల ఉప సర్పంచ్ పయ్యావుల కవితా రాజగోపాల్, ఎంపీటీసీ దశవాణి, పలు వార్డ్ మెంబర్లు మాట్లాడుతూ అవిలాల పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం శ్రేయస్సు కోరి పాలన కొనసాగిస్తుందని అన్నారు. గత వైసిపి పాలకులకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పాలకులకు చాలా వ్యత్యాసం ఉందని గతంలో రాక్షస పాలన కొనసాగిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అవిలాల పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అవిలాల ఉప సర్పంచ్ పయ్యావుల కవితా రాజగోపాల్, ఎంపీటీసీ దశవాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.





