నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : గద్వాల్ నియోజకవర్గం లోని కేటీ దొడ్డి మండల పరిధిలోని ఇర్కిచెడు గ్రామం లో బాలల హక్కుల పరిరక్షణ ఆధ్వర్యంలో బాల్య వివాహలను వ్యతిరేకస్తూ & బడి బయట ఉన్న పిల్లలు అందరూ బడిలో ఉండాలి. గ్రామంలో వీధి విధినా వాడవాడలలో ప్లేకార్డ్ స్లొగన్స్ చేసుకుంటా కన్వీనర్ చందపాషా మాట్లాడుతూ మన గ్రామంలో బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలి 100% హాజరు శాతం ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను పనులకి పంపకుండా రోజు బడికే పంపాలి అని చెప్పడం జరిగింది. వెంకటరెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహలు చేయరాదు బాల్య వివాహ చట్టం పెళ్లి చేసిన వారి రెండు సంవత్సరాల జైలు శిక్ష అదేవిదంగా 50 వేల రూపాయలు జరిమానా విధించబడును. కల్యాణ లక్ష్మి వద్దు విద్యాలక్ష్మి ముద్దు ముఖ్యంగా అమ్మాయిలను పై చదువులు చదివించాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

