Tuesday, March 31, 2026

ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడిని కాపాడిన మట్టేవాడ పోలీసులు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎల్లం బజార్ కు చెందిన ఓ వ్యక్తి వ్యక్తిగత సమస్యల తో రెండంతస్తుల భవనం పైకి చేరుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మట్టేవాడ పోలీసులు ఆ వ్యక్తిని కాపాడారు వివరాలలోకి వెళితే వరంగల్ పట్టణం లోని ఎల్లం బజార్ కు చెందిన కట్టు కోజు శివ కుమార్ అనే వ్యాపారి ఎల్లం బజార్ లోని ఆదర్శ వీధి గల మహబూబ పంచధన్ కాలేజీ ఎదురుగా ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ పైకి వ్యక్తిగత సమస్యల పై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు వెంటనే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న మట్టేవాడ బ్లూ కోర్టు సిబ్బంది ఆ వ్యక్తిని బిల్డింగ్ పై నుంచి కిందికి దించి రక్షించి సురక్షితంగా తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు దీంతో నగర ప్రజలు మట్టవాడ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బందిపై హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News