నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : భారతరత్న స్వతంత్ర సమరయోధుడు,మొదటి విద్యాశాఖ మంత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి స్థానిక కాంగ్రెస్ భవన్ లో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.జువాడి నర్సింగ రావు నాయకత్వంలోజరిగిన కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల ఇంచార్జ్, వరంగల్ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేటర్ భాస వేణు యాదవ్, టిపిసిసి కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ ఎండి అవెజ్ , పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు అంజిరెడ్డి, ఏర్రోల హన్మాండ్లు యాదవ్, మార్గం గంగాధర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు వెంట ప్రణయ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు విజయ్ పటేల్, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆకుల లింగారెడ్డి, అబ్దుల్ షకీల్, బత్తుల భరత్, సురేష్, జెట్టి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





