- అభినందించిన సిఐ హరికృష్ణ
- 5 వేల రూపాయల ఆర్థిక సహాయం
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మాటం సంగీత ఇటీవల జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈనెల 5వ తేదీన జార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయి హామర్ త్రో పోటీలకు కమలాపూర్ మోడల్ స్కూల్ లో మొదటి సంవత్సరం చదువుతున్న సంగీత ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని కమలాపూర్ సిఐ ఇ. హరికృష్ణ అభినందించడంతో పాటుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా మౌటం సంగీత క్రీడలలో ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతుందని తెలంగాణ రాష్ట్రానికి మరియు కమలాపూర్ మండలానికి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.

