- రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
నేటి సాక్షి గోదావరిఖని (రమేష్):
అయ్యప్పస్వామి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో వర్దిలాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ స్వామి వేడుకున్నారు. గోదావరిఖని పోచమ్మ దేవాలయం ఆవరణలో శ్రీ ధర్మశాస్త్ర నిత్యన్నాధాన వేదిక వార్షికోత్సవం. సందర్భంగా అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కౌటం బాబు గత 36 సంవత్సరాలుగా అయ్యప్పస్వామి దీక్షను తీసుకుని శ్రీ ధర్మశాస్త్ర నిత్యన్నాధాన వేదిక ఎర్పాటు చేసి ఎన్నో ఎళ్లుగా అనార్దులకు అన్నదానం చేయండం గొప్ప విషయం అన్నారు. 41 రోజుల పాటు పోచమ్మ దేవాలయం ఆవరణ అన్నవితరణ కార్యక్రమం చేపట్టడం సంతోషకరం అన్నారు. తాము ఎన్నో ఎళ్లుగా అయ్యప్పస్వామి దీక్షను తీసుకోవడం జరుగిందని మూడు సంవత్సరాలు అయ్యప్పస్వామి 108 రోజుల దీక్షను తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం లో ధర్మశాస్త్ర వెధిక వ్యవస్దపాకులు కౌటం బాబు. రఘుసింగ్ కార్పోరేటర్లు పాముకుంట్ల భాస్కర్. కల్వచర్ల కృష్ణ వేణీ గాధం విజయ నాయకులు. నారాయణదాసు మారుతి పర్లపల్లి రవి కుడుదుల శ్రీనివాస్ మహేందర్ వెంకన్న ముద్దసాని సంధ్యా రెడ్డి అవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.