నేటి సాక్షి, మెట్ పల్లి :
ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందచేసే కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆర్టీసీ డిపో సిబ్బందికి డిపో మేనేజర్ దేవరాజ్ ఆదివారం భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్నందున వారికి అసౌకర్యం కలగకుండా సిబ్బంది బయటకు వెళ్లకుండా బస్టాండ్ యందు భోజనం చేయుటకు వీలుగా భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది అన్ని సమయాల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించుటకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సురేష్, రాములు, అశోక్, శేఖర్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.





