- జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్
నేటిసాక్షి, రాయికల్ (సింగిడి కార్తీక్) : ఆస్పత్రి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలందించాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్కుమార్ సూచించారు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఫార్మసీ ల్యాబ్, వాక్సిన్ స్టోరేజ్ రూమ్ ని పరిశీలించారు. ఆ సందర్భంగా సిబ్బంది, వైద్యులకు తగు సూచనలు అందజేసారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి డాక్టర్సతీష్ కుమార్, డిపిఓ రవీందర్, సబ్ యూనిట్ ఆఫీసర్ అవారి శ్రీధర్, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఫార్మాసిస్ట్ దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి, హెల్త్ అసిస్టెంట్ భూమయ్య పాల్గొన్నారు.





