Wednesday, March 25, 2026

నేటి యువతకు మీనాక్షి నటరాజన్ ఆదర్శం

ఇక రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకం ప్రారంభం: కెఎల్ఆర్

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్):
నేటి రాజకీయ నేతలకు నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కొనియాడారు. గాంధీభవన్ లో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే నేటి నాయకులుకు భిన్నంగా ఆమె ఉండి… అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. మీనాక్షి నటరాజన్ రాకతో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలోపేతం అయ్యేందుకు దోహద పడుతుందన్నారు. యువత, మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు. ప్లైక్సీల్లో కాదు – జనంలో ఉండాలన్న మీనాక్షి నినాదం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహనిస్తుందని కేఎల్ఆర్ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News