
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని, నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రారంభించామని, గత ప్రభుత్వ హయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని,ఓటమి భయంతోనే నరేందర్ రెడ్డి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుందని, 317 జీవో సడలింపు పై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నమని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డిఎస్సీ నిర్వహించి, నియామకాలు చేపట్టడం జరిగిందని, ధర్మపురి ప్రాంతంలోని సంస్కృతాంధ్ర కలశాలను విప్ లక్ష్మణ్ కుమార్ పట్టు పట్టి తిరిగి పునః ప్రారంభించడం జరిగిందని,నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ధర్మపురిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలుపుతున్నామని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో నిరుద్యోగుల గురించి కనీసం పాలకులు పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని, ధర్మపురిలో పునః ప్రారంభించడానికి సాధ్యం కాదు అన్న సంస్కృతాంధ్ర కలశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ,మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కొండ సురేఖ సహకారంతో తిరిగి పునః ప్రారంబించడం జరిగిందని, సుమారు 100 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ ను ధర్మపురికి మంజూరు చేయడం జరిగిందని,బీజేపీ నాయకులు వచ్చి తమ అభ్యర్ధిని ఓటు వేయాలని అడిగితే మా ధర్మపురి లోని నేరెల్ల లో ఏర్పాటు చేయాలనుకున్న నవోదయ విద్యాలయాన్ని మీ పార్టీ ఎంపి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని చూసారని మా ప్రాంతం విద్య పరంగా అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా అని బీజేపీ నాయకులను పట్టభద్రులు ప్రశ్నించాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేసి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని, పట్టభద్రులు నరేందర్ రెడ్డి 2 నెంబరు పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





