నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యూజే హెచ్ 143 రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా కు గురు వారం ఘన సన్మానం జరిగింది. యువ చైతన్య దీపం ఫౌండేషన్ చైర్మన్ శేఖర్ సేనాపతి ఆధ్వర్యంలో లాయక్ పాషాను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే జరిగిన టియుడబ్ల్యూజే ఎన్నికలలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా లాయక్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాయక్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ రజాక్, పట్టణ ఇంచార్జ్ మహమ్మద్ కలీం, సభ్యులు మహమ్మద్ యాసీన్, మహమ్మద్ అక్బర్ పాషా, కాసర్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత వారికి కృతజ్ఞతలు తెలిపారు.





