- చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు..
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి:
క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఫిట్నెస్ ఫ్రిక్ బ్యాడ్మింటన్ క్లబ్ గ్రౌండులో మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షెటిల్ టోర్నమెంట్ను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు, విద్య క్రీడతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. యువత, విద్యార్థులు గంజాయి, మొబైల్ వాడటం, చెడు వ్యసనాలను దూరంపెట్టి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా వివిధ ప్రాంతాల క్రీడాకారుల మద్య స్నేహాభావం పెరుగుతుందన్నారు. పోలీస్ శాఖ ఆధర్యంలో రానున్న రోజుల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, ఫిట్నెస్ ఫ్రిక్ బ్యాడ్మింటన్ క్లబ్ క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.





