నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
నెహ్రు యువకేంద్రం మరియు జై భారత్ ఆధ్వర్యంలో చందుర్తి మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ క్రీడలు నిర్వహించడం జరిగింది. పొంచెట్టి రాకేష్, మేడిశెట్టి శ్రీహరి, గొల్లపల్లి రాంబాబు, నక్క రవి, యండి రెహ్మాన్ తదితర క్రీడాకారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సిరికొండ శ్రీనివాస్, నేరల్ల రమేష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ..క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు శరీరక దృఢత్వం కూడా ఉంటుందని, యువత మద్యం, డ్రగ్స్ వైపు యువత వెళ్లకుండా క్రీడల్లో సత్తా చాటలని” అన్నారు. ఈ కార్యక్రమం లో గుగ్గిల్ల సాగర్, వెంగల వెంకటేష్, మేడిశెట్టి మనోజ్ తదితరులు పాల్గొన్నారు





