నేటి సాక్షి, మెట్ పల్లి : మహాశివరాత్రి సందర్బంగా మెట్ పల్లి మున్సిపల్ కార్మికులు సోమవారం వేములవాడ బయలుదేరి వెళ్లారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం పరిధిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించటానికి మెట్ పల్లి మున్సిపల్ నుండి పారిశుద్ధ్య సిబ్బందిని కమిషనర్ పంపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వేములవాడ దేవస్థానం పరిధిలో కేటాయించబడిన రోడ్లను పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి మెట్ పల్లి నుండి పారిశుద్ధ సిబ్బందిని పంపడం జరుగుతుందని అక్కడ సమర్థవంతంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించి రావాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.





