- 500మందితో ఎంఐఎంలో మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ చేరిక
- సాలార్ చౌక్‌లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్
నేటి సాక్షి, కరీంనగర్, ఆగస్టు 17: రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అన్ని అస్త్రశస్త్రాలతో పోటీకి సన్నద్ధంగా ఉందని, రెడీ కరీంనగర్ అంటూ యువత ఎంఐఎంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం నగరంలోని సాలార్ చౌక్ లో ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఖాన్ పుర మాజీ కార్పొరేటర్, తెలంగాణ హజ్ కమిటీ మాజీ మెంబర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆరిఫ్ అహ్మద్, తన 500 మంది అనుచరులతో ఎంఐఎం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన ఆరిఫ్ కు, అతడి అనుచరులందరికీ గులాం అహ్మద్ హుస్సేన్ ఆకుపచ్చ కండువా కప్పి సాలార్ చౌక్ లో ఎంఐఎంలోకి ఆహ్వానించారు. సాలార్ చౌక్ నుంచి పాదయాత్రగా ఖాన్ పుర రోడ్డు మీదుగా క్రిస్టల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కు వందలాది మంది జనంతో ర్యాలీగా తరలివచ్చారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఖాన్ పుర మాజీ కార్పొరేటర్ ఆరిఫ్, గతంలో ఎంఐఎం పార్టీలో చేరుతానని, ఎంఐఎం సిద్ధాంతాలకు, పార్టీ విధివిధానాలకు ఆకర్షితుడై గత ఆరు సంవత్సరాల క్రితం ఆర్జీ పెట్టుకున్నాడని, ఆరిఫ్ ఆర్జీ అంశాన్ని తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరిఫ్ ను పార్టీలోకి తీసుకునే అంశంపై ముందుగా నగరంలోని ఎంఐఎం పార్టీ వివిధ డివిజన్ల మెజారిటీ అధ్యక్షుల అభిప్రాయ సేకరణ చేపట్టామన్నారు. ఆరిఫ్ ను పార్టీలోకి తీసుకునే విషయాన్ని నగర కమిటీలో కూలంకషంగా చర్చించాక, మెజారిటీ డివిజన్ల అధ్యక్షులు అభిప్రాయంతో, నగర కమిటీ సభ్యులు, పార్టీ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లాక, ఆరిఫ్ ను ఎంఐఎంలోకి తీసుకోవాలని గత 15రోజుల క్రితం తమ అధినేత ఒవైసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అనంతరం ఈరోజు ఆరిఫ్ ను ఎంఐఎం లోకి చేర్చుకోవడం జరిగిందన్నారు. ఆరిఫ్ ఎంఐఎంలో చేరడంతో కార్ఖానా గడ్డ ప్రాంతంలో, ఎంఐఎం మరింత బలీయమైన శక్తిగా రూపాంతరం చెందిందన్నారు. గత 5సంవత్సరాలుగా పార్టీని దశలవారీగా నగరంలో నిర్మాణం చేస్తూ…40డివిజన్లలో ఎంఐఎం ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేశామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని అత్యధిక డివిజన్లలో గెలిపించి, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కరీంనగర్లో ఎంఐఎం పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. సాలార్ చౌక్ నుంచి క్రిస్టల్ కన్వెన్షన్ వరకు దారి పొడవునా జనప్రవాహంలా మారింది. ఆరిఫ్ చేరికతో ఎంఐఎం పార్టీలో నూతన ఉత్తేజం కనిపించింది. ఉమ్మడి జిల్లాలోని మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల నుంచి ఎంఐఎం పార్టీ నాయకులు ఈ చేరికల కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు బర్కత్ అలీ, హాఫీజ్ యూసుఫ్, ఆతిన, ఖమరొద్దీన్, ఖాజా, ఇబ్రహీం, అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, ఖాజా మజారోద్దీన్, తాజాద్దీన్, సాజిద్, అసదుల్లా బేగ్, మాజిద్ హుస్సేన్ తో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్య.దర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








