- జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో జనవరి 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిరుద్యోగ యువతకు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పేటిఎం సంస్థలో మంచిర్యాల పరిసర ప్రాంతాలలో పని చేసేందుకు 50 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, ఇందుకు గాను 18 నుండి 35 సంవత్సరాల వయస్సు, ఎస్ఎస్సి, ఇంటర్ కలిగి ఉండి, స్మార్ట్ ఫోన్, బైక్ కలిగిన పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 7013188805, 9110368501 నంబర్లలో సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.





