నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని చంపాపేటలోని మందా జగన్నాధం నివాసంలో ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, ఆయన మరణం తీరని లోటని మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేసారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మంద జగన్నాథం భౌతిక కయానికి పుష్పాంజలితో నివాళులు ఘటించారు.





