- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి జూపల్లి


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా: రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నేడు పాన్ గల్ మండలంలోని పాన్ గల్, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి, జమ్మాపూర్, బండపల్లి, వెంగలాయపల్లి, గోప్లాపూర్ గ్రామాలలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపనలు చేశారు. కేతేపల్లి గ్రామంలో 35 లక్షలు, బుసిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షలు, గొఫ్లాపూర్ గ్రామంలో 22.5 లక్షలు, వెంగలయ పల్లి గ్రామంలో 15 లక్షలు,పాన్ గల్ మండల కేంద్రంలో 20 లక్షలు, జమ్మాపూర్ గ్రామంలో 15 లక్షలు, బండపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజ్ ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు కావడం జరిగింది.నేడు ఆయా గ్రామాలలో మంత్రి జూపల్లి శంకు స్థాపన చేసి గ్రామాలలో అన్ని కాలనీ లలో రోడ్లు నిర్మించే విధంగా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.





