
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం రుద్రంగి మండలకేంద్రంలో గ్రామ సభకు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి,కరీంనగర్ ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులు హెలికాప్టర్ దిగవలసిన ప్రదేశాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రులు గ్రామ సభలను అలాగే కథలపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ ను సందర్శించనున్నారు.





